Nubia Red Magic 10 Pro Plus: గేమింగ్ కోసం అత్యాధునిక టెక్నాలజీ.. గేమింగ్ ప్రియులకు అత్యుత్తమ ఎంపిక! 10 month ago
నుబియా ఒక చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ. ముఖ్యంగా ఈ కంపెనీ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ తయారీకి ప్రసిద్ధి చెందింది. నుబియా లోని రెడ్‌మ్యాజిక్ సిరీస్ అద్భుతమైన పనితీరుగల ఫోన్లను అందించి మార్కెట్లో మంచి పేరు తెచ్చుకుంది. ఈ కంపెనీ ఫోన్‌లు శక్తివంతమైన ప్రాసెసర్లు, ఆధునిక కూలింగ్ సిస్టమ్స్ మరియు ఉన్నత రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేలతో సహా.. అధిక-పనితీరు లక్షణాలను అందిస్తూ మొబైల్ గేమర్‌లను ఆకట్టుకుంటాయి. నుబియా ప్రస్తుతం మొబైల్ ఫోన్ టెక్నాలజీని కొత్త దిశలో తీసుకెళ్లేందుకు అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేస్తోంది. ఈపనిలో భాగంగా నుబియా తన కొత్త మోడలైన "Nubia Red Magic 10 Pro Plus" మొబైల్‌ను భారత్ లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. ఒకసారి ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.!
Nubia Red Magic 10 Pro Plus ఫీచర్లు:
డిస్‌ప్లే: 6.85-అంగుళాల AMOLED డిస్‌ప్లే
రిఫ్రెష్ రేట్: 144 Hz
పీక్ బ్రైట్‌నెస్: 2000 nits
ప్రాసెసర్: Qualcomm Snapdragon 8 Elite
ఆపరేటింగ్ సిస్టమ్: Android v15, RedMagic
బ్యాటరీ: 7050 mAh
ఛార్జింగ్: 120W ఫాస్ట్ ఛార్జింగ్
బరువు: 229 గ్రాములు
వేరియంట్స్:
- 12GB RAM + 256GB స్టోరేజ్
- 16 GB RAM + 512 GB
కెమెరా ఫీచర్లు:
బ్యాక్ కెమెరా:
- 50 MP మెయిన్ కెమెరా
- 50 MP అల్ట్రా-వైడ్ యాంగిల్
- 2 MP మాక్రో కెమెరా
ఫ్రంట్ కెమెరా: 16 MP సెల్ఫీ కెమెరా
కనెక్టివిటీ ఫీచర్లు:
- 5G, 4G డ్యూయల్ సిమ్
- Wi-Fi 7
- బ్లూటూత్ 5.4
- GPS, NFC, USB OTG
- 3.5mm ఆడియో జాక్
కలర్ ఆప్షన్స్:
- డార్క్ నైట్
- వైట్ నైట్
- ట్రాన్స్‌పరెంట్ సిల్వర్ డ్యూటీరియం
- ట్రాన్స్‌పరెంట్ డార్క్ నైట్
ప్లస్ పాయింట్స్:
- 11 నిమిషాల్లో 50% ఛార్జింగ్
- ఆన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
- 1080p వీడియో రికార్డింగ్ సదుపాయం
- స్టీరియో స్పీకర్లు
మైనస్ పాయింట్స్:
- స్పేర్ పార్ట్స్ దొరకడం కష్టం
- సర్వీస్ సెంటర్లు లేవు
- డిజైన్ అంత క్లాస్ లుక్ లో లేదు
- బరువు ఎక్కువ
నుబియా కంపెనీ సాధారణంగా మంచి గేమింగ్ ఫోన్లను అందిస్తుంది. "నుబియా రెడ్ మేజిక్ 10 ప్రో ప్లస్" మొబైల్ మంచి గేమింగ్ అనుభవాన్ని అందిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఫోన్ చైనా మార్కెట్లో మంచి స్పందన పొందింది. ప్రస్తుతం భారత్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. భారత్ లో ఎప్పుడు లాంచ్ చేస్తారో? కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ ఫోన్ ధర రూ.69,999 నుండి ప్రారంభం కానుంది. మంచి ప్రీమియం లగ్జరీ మొబైల్ ఫోన్ కావాలనుకునే వారికీ ఇది చాల మంచి ఎంపిక.
ఇది చదవండి: ఫోటోగ్రఫీకి బెస్ట్ ఆప్షన్.. వివో కొత్త మోడల్ యొక్క కొత్త స్టైలిష్ డిజైన్..